మొన్నో రోజూ, మా మూడేళ్ళ బుడ్డోడు నేనేదో పనిలో ఉండగా "నాన్నా!! నాన్నమ్మకీ అమ్మ ఎవరూ!?" అనడిగాడు. "మా అమ్మమ్మ రా!" అని చెప్పి పంపించాను. మరి కాసేపటికి మళ్ళీ అడిగాడు "మరైతే వాళ్ళమ్మ ఎవరూ?" అని. నాకు గుర్తున్న పేరేదో చెప్పి పంపించాను. ఇలా వాడు చీటికీ మాటికీ వచ్చి విసిగిస్తుంటే భరించలేక "ఎందుకు అడుగుతున్నావురా బాబూ! ఇపుడు ఇవన్నీ" అన్నాను కాస్త చిరాగ్గా. వాడు బిక్క మొహంతో చెప్పాడు "ఏంటంటే! ఇందాకా అక్క చెప్పింది తన స్కూల్ లో చెప్పారంట, మనుషులందరూ కోతి నుంచే పుట్టారని, ఫస్ట్ ఆ కోతికి పుట్టిందెవరో అనీ అడుగుతున్నా నాన్నా!!" 😂😂😂😂😂
No comments:
Post a Comment